calender_icon.png 15 October, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు

14-10-2025 07:24:49 PM

మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షులు యేట మధుకర్ కుటుంబ సభ్యులను పట్టణ బీజేపీ నాయకులు పరామర్శించారు. మంగళవారం నీల్వాయిలో మధుకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ  కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోవద్దని పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామటెంకీ  దుర్గారాజ్, కొల్లేటి శివ, చంద్రమౌళిలు పాల్గొన్నారు.