14-10-2025 07:23:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయంలో ఆలయ డబ్బులను కాంట్రాక్టర్ నుంచి తిరిగి వసూలు చేయకపోతే ఆందోళన చేపడతామని బిజెపి జిల్లా కార్యదర్శి విలాస్ హెచ్చరించారు. మంగళవారం సారంగపూర్ లో ఆయన మాట్లాడుతూ అడెల్లి పోచమ్మ ఆలయాన్ని ప్రభుత్వం 6.60 కోట్లతో నిర్మించిందన్నారు. దేవాదాయ దేవాదాయశాఖ అడెల్లి పోచమ్మ ఆలయం సొంత నిధులను 158 కోట్ల నిధులను కాంట్రాక్టర్కు ఇవ్వడం జరిగిందని ఆ నిధులను తిరిగి ఆలయ కమిటీలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నిధులు దుర్వినియోగం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నరేష్ వీరయ్య రాజేష్ సహాయబ్రావు తదితరులు పాల్గొన్నారు.