14-10-2025 07:27:53 PM
ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్ట్ సాగర్ కు పరామర్షలో మంత్రి శ్రీధర్ బాబు..
మంథని (విజయక్రాంతి): ఆ భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోరుకోవాలని మంథని పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ మిరియాల సాగర్ యాదవ్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధైర్యం నింపారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా సాగర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ యాదవ్ కు తాము అండగా ఉంటామని, అధైర్యపడద్దని ధైర్యం నింపారు. సాగర్ తల్లిదండ్రులకు ఓదార్చి, త్వరలోనే మీ కుమారుడు ఆరోగ్యంగా కోలుకుంటాడని, సాగరకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.