calender_icon.png 13 May, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కుంగ్-ఫూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

13-04-2025 09:59:51 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ -పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ సమావేశం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి 50 మంది కుంగ్-పూమాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్లు జిల్లాలో కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై పలు అంశాలను చర్చించారు. జిల్లాలో ప్రతిభవంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు  తీర్మానించారు. త్వరలో వాటిని జిల్లాలో అమలు చేయనున్నట్లు  పేర్కొన్నారు. అనంతరం కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అసోసియేషన్ కు నూతన కమిటీని  మాస్టర్స్ ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్షులు:ఐ.ఆదినారాయణ, కార్యనిర్వహక అధ్యక్షులు గా ఎన్.వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా పి.కాశీ హుస్సేన్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులంతా కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధి కొరకు, తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర సీనియర్ మాస్టర్ ఐ.ఆదినారాయణ పర్యవేక్షణలో,జరిగిన ఈ కార్యక్రమంలో కోచ్ లు పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.