13-05-2025 04:32:32 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సోమవారం రాత్రి తరగతి గదుల్లోని ఫ్యాన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. తరగతి గదుల తాళాలు పగలగొట్టడంతో పాటు కిటికీల ఊచలు తొలగించారు. అలాగే పలు తరగతి గదుల్లోని విద్యుత్ పరికరాలను, డ్యూయల్ బెంచీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఇన్చార్జి హెడ్మాస్టర్ జనార్ధన చారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.