calender_icon.png 13 May, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసితులకు అండగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటా: మంత్రి శ్రీధర్ బాబు

13-05-2025 04:23:07 PM

మంథని (విజయక్రాంతి): భూ నిర్వాసితులకు అండగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. హైదరాబాద్ లో సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి చెందిన రైతులు మంత్రిని కలిసి రత్నాపూర్ లో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ కోక కోలా కంపెని ఈ ప్రాంతంలో నేలకొల్పడం ద్వారా నిరుద్యోగులైన యువతకు తమ స్వగ్రామానికి, తమ ప్రాంతంలోనే మెరుగైన ఉద్యోగం లభిస్తుందని మంత్రికి తెలియజేశారు.

భూమి కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి సరియైన నష్టపరిహారంతో పాటు రత్నాపూర్ ప్రజలకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రత్నాపూర్ గ్రామ, రామగిరి మండల మహిళా మాతలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రముఖ కుట్టు మిషన్ సంస్థ అయిన ఉషా కంపెనీ వారిచే మహిళలకు ట్రైనింగ్ ఏర్పాటు చేయించి రాబోవు రోజుల్లో ఇక్కడ వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ఎంవోయూ అయ్యేలా చేయించి మహిళ మాతలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడంలో ముందుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

రత్నాపూర్ రైతులను అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు.. 

రత్నాపుర్ రైతు సోదరులు స్వచ్ఛందంగా తమ భూమిని అభివృద్ధి కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబు వారిని అభినందించారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, మాజీ సర్పంచ్ ఎరుకల బాపురావు, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, పొన్నం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు మట్ట రాజకుమార్, రైతులు కొండ్రు అంజన్న, కొడారి సాది, ధర్మముల వెంకటేష్ కండె పోషం, కెక్కర్ల శ్రీనివాస్ దాసరి రామచంద్ర, తొట్ల రాయమల్లు యాదవ్, కండె గట్టయ్య, మన్నాల రవీందర్, మండల మన్నాల రాజు, దాసరి సురేష్, గొర్రె కొమురయ్య యాదవ్, బెజ్జాల లక్ష్మణ్, బెజ్జాల, రాజేష్, అంగూరి నారాయణ, బెజ్జాల సదానందం, మన్నల లాలు, శ్రీనివాస్, సాయి సంజయ్ వర్మ, రావికంటి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.