calender_icon.png 25 September, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీతో జనంలోకి బీజేపీ

25-09-2025 01:09:29 AM

  1. మండల, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో స్వదేశీ ఉద్యమం
  2. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లాల్లో కార్యక్రమాలు
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుంతోంది. ఇందులో భాగంగానే బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్‌చందర్ రావు అధ్యక్షతన నూతనంగా నియమించడిన రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు.

ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, పార్టీ చేపట్టే కార్యక్రమాలపై పదాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.  జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో వినియోగదారులను కలిసి అవగాహన కార్య క్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను సైతం చేపట్టాలని  సమావేశంలో  తీర్మానించారు. పార్టీ నాయకులు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిల్లో పర్యటించాలని రామ్‌చందర్‌రావు సూచించారు.

30న ‘మేరా దేశ్ పహలే’

ప్రధానంగా ఈనెల 30న ప్రధాని నరేంద్ర మోదీ జీవన ప్రయాణంపై ప్రత్యేకంగా ‘మేరా దేశ్ పహలే’ కల్చరల్ కార్యక్రమం హైటెక్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 10వేల మంది పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

అంతేకాకుండా రాష్ర్టంలో జరగబోయే స్థానిక సం స్థల ఎన్నికలు, ప్రజాసమస్యల పరిష్కారంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ర్ట ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని ఎండగట్టేలా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చిం చారు. నేటి నుంచి మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.  సమావేశంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రా వు, రాష్ర్ట పదాధికారులు పాల్గొన్నారు.