25-09-2025 01:08:46 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సమ్మక్క- జాతరకు సం బంధించి చేపట్టిన మేడారం అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవం త్ రెడ్డి ఇటీవల అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచనలతో సచివాలయం నుంచి మంత్రి సీతక్క, వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి దేవాదాయ శాఖ ము ఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ ఎన్ అశోక్, దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు.