calender_icon.png 25 September, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ క్యాంప్ ఆఫీస్ వద్ద దినసరి కార్మికుల ధర్నా

25-09-2025 01:10:15 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులకు గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్డిఓ ఆఫీస్  వద్ద చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరింది. ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్దకు కార్మికులు చేరుకొని ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీకి వినతిపత్రం అందజేశారు.

వెంటనే స్పందించిన ఎంపీ కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్, యూనియన్ నాయకులు తాజుద్దీన్, మహేష్, నాగేశ్వరరావు,కుర్ర మహేష్, రాంబాబు, ముత్తయ్య, నాగరాజు, మంగలాల్, వెంకన్న, కుమార్, అక్బర్  పాల్గొన్నారు.

మంత్రి తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తా ఎంపీ బలరాం నాయక్ హామీ 

రాష్ట్ర మంత్రి తో మాట్లాడి  డైలీ వేజ్ హాస్టల్ వర్కర్ సమస్యలను పరిష్కరిస్తానని అదేవిధంగా హాస్టల్ వర్కర్స్ అందర్నీ పార్లమెంటు చేసే విధంగా తన వంతు కృషి చేస్తా అందిస్తానని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోలిక బలరాం నాయక్ హామీని ఇచ్చారు ఈరోజు పార్లమెంట్ సభ్యులు క్యాంప్ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వడం కోసం వెళ్లిన హాస్టల్ వర్కర్స్ ను ఉద్దేశించి ఈ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆయనే వారికి ధైర్యం చెప్పి ఈ విషయం గురించి గతంలోనే తాను మంత్రి ఇతర అధికారులతో మాట్లాడానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్, తాజుద్దీన్, మహేష్, ముత్తయ్య, మంగీలాల్, నాగరాజులు పాల్గొన్నారు.