25-08-2025 01:54:45 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీ(Nakrekal Municipality) పరిధిలోని నెలకొన్న ప్రజా సమస్యలును తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, పట్టణ అధ్యక్షులు మురళీమోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి వెంకటేశ్వర్లు, పందాల సైదులు, కార్యదర్శి గాయం మహేష్ రెడ్డి, యువత అధ్యక్షుడు మేడిపల్లి శివ, చందుపట్ల వేణుమాధవ్, నల్లగొండ లింగయ్య, ఏర్పుల రేణుక, జగదీష్, రాపోలు శరత్, కారింగుల యాదగిరి, అనుముల ఉపేందర్ ,మాచర్ల మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.