calender_icon.png 25 August, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్ల కమిషన్ వెంటనే చెల్లించాలి

25-08-2025 02:10:24 PM

తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత..

సదాశివనగర్: గత ఐదు నెలల నుండి రేషన్ డీలర్లకు చెల్లించే కమిషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం తహసిల్దార్ సత్యనారాయణ(Tahsildar Satyanarayana)కు వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ నెల నుండి ఆగస్టు వరకు రావాల్సిన కమిషన్ ఇప్పటికీ రాలేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలల బియ్యాన్ని అదనంగా పంపిణీ చేసినట్టు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బియ్యాన్ని పంపిణీ చేసిన తమకు రావాల్సిన కమిషన్ ను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు డీలర్లు అప్పుల పాలైనట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా కాకుండా పాత పద్ధతిలోనే కమిషన్ ను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.