20-10-2025 12:33:41 AM
ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ సికింద్రాబాద్ పార్ల మెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. విన య్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్, బూత్ నెంబర్ 122 ఇన్చార్జి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.విన య్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి బీజేపీ కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు.