calender_icon.png 20 October, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

20-10-2025 12:43:04 AM

  1. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం   
  2. మృతుల్లో అక్కాతమ్ముడు, చిన్నారి 
  3. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మోతుగూడ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వాంకిడి మండలం బెండార గ్రామానికి చెందిన జగన్.. దీపావళి వేడుకల కోసం కాగజ్‌నగర్ మండలం వంజరి గ్రామం లో  ఉంటున్న తన సోదరి అనసూయ, ఆమె ఇద్దరి పిల్లలను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళుతున్నాడు.

మోతుగూడ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో జగన్ (27), అతని అక్క అనసూయ (32), మేనల్లుడు ప్రజ్ఞాషీల్ (4) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మేన కోడలు చందరి (3)ని మంచిర్యాలకు తరలించారు. ఆసిఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు వెళ్లి, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.