20-10-2025 02:07:34 AM
వాషింగ్టన్, అక్టోబర్ 19: ‘నా మాటే వేదం.. నా మాటే శాసనం’ అని బాహుబలి సినిమాలో రాజమాత శివగామి దేవి పాత్రధారిణి గద్గత స్వరంతో చెప్పిన డైలాగ్ ప్రేక్ష కుల్లో ఎంతో పాపులర్ అయితే.. ప్రస్తు తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..
ఆ దేశ ప్రజలు తనకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలపై కృత్రిమ మేధస్సుతో రూపొందిం చిన సెటైర్ వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేసి తన ఆధిపత్య ధోరణిని పదర్శించారు. ‘నేను చక్రవర్తిని నన్నెవ్వరూ ధిక్కరించ లేరు.. అందరూ తనవద్ద మోకరిల్లాల్సిందే, నానపై రాళ్లు (నిరసనలు)వేస్తే మీ మీదే బురదపడుతుంది’ అనే అర్థం వచ్చేలా రూపొం దించిన ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి చూసిన నెటిజన్లు ‘ఔరా.. అమెరికా అధ్యక్షుడా మజాకా’ అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారట.
‘నో కింగ్స్’ పేరిట నిరసనలు
అమెరాకి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో న్యూయార్క్, వాషింగ్టన్, డీసీ, షకాగో, లాస్ ఎంజెలెస్ సహా మొత్తం 50 నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్‌లలోని యూఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల నియత్రణ చర్యలు, యూనివర్సిటీలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను మోహరించడం వంటి ట్రంప్ అనేక నిర్ణయాలపై ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.
కృత్రిమ వీడియోలతో హల్‌చల్
ప్రజల నిరసనలకు ప్రతిగా ట్రంప్ సోష ల్ మీడియాలో కృత్రిమ మేధస్సుతో రూ పొందించిన వీడియోలు షేర్ చేసి హల్‌చల్ చేశారు. అందులో ట్రంప్ తలపై కిరీటంతో చక్రవర్తిలాగా ఓ యుద్ధ విమానంలో వెళ్తున్నట్లు రూపొందించారు. అమెరికా వీధుల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై విమానం నుంచి బురదను జార విడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నా యి.
ఆందోళనకారుల్లో ట్రంప్‌ను తరచూ విమర్శంచే డెమోక్రటిక్ కార్యకర్త హ్యారీ సిస్స స్ ఉన్నట్లు రూపొందించారు. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌షేర్ చేసిన మరో ఏఐ వీడియోలో ట్రంప్ కిరీటం, చక్రవర్తి దుస్తులు ధరిస్తున్నట్లు ఉంది. అనంతరం ట్రంప్ ముందు నాన్సీ పె లోసి, ఇతర డెమోక్రటిక్ పార్టీ నేతలు మోకరిల్లుతున్నట్లు కనిపించింది.