calender_icon.png 19 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందుత్వంతోనే బీజేపీని అధికారంలోకి తీసుకువస్తా..

19-11-2025 06:10:52 PM

కాంగ్రెస్ వైఫల్యాలే కాషాయ సమరభేరికి శ్రీకారం..

కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిధులే.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

హుజురాబాద్ (విజయక్రాంతి): హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన బూత్ కమిటీల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... బీజేపీ పార్టీని హిందుత్వ వాదంతోనే గడపగడప తిరుగుతూ తెలంగాణలో రామరాజ్యం తీసుకువచ్చి తిరు తామని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యలే కాషాయ సమరభేరికి  శ్రీకారం అన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకునేందుకే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సర్పంచులు పనులు చేసి అప్పుల  పాలయ్యారన్నారు.

సుమారుగా ఒక్కొక్క సర్పంచ్ 50 లక్షల వరకు అప్పులు చేశారని. టిఆర్ఎస్ కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి మళ్లించారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే పంచాయతీలకు నయా పైసా నిధులు రావని సూచించారు. ఊళ్ళల్లో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతుందని. రాష్ట్రం ఏ నిధులను మంజూరు చేయడం లేదని అన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీలు బాగుపడతాయని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని సూచించారు. ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తుందని, ఎన్నికలు వస్తే ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటు వేయడం లేదని ప్రశ్నించారు.

ముస్లింలు అంతా ఒకటై మసీదులో ప్రతిజ్ఞ చేసి బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు అన్నారు. 12 శాతం ముస్లింలంతా ఒకటైతే తప్పు లేనిది 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యలపై కాషాయం సమర భేరికి శ్రీకారం చుడతామన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈనెల 26 సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కాషాయ సైనికుడు బండి సంజయ్ పై రూపొందించిన గీతాన్ని విడుదల చేసిన చంద్రశేఖర్ తివారి బలిరా.. బలి బలి రా అంటూ సాగిన గీతానికి ఉత్సాహంగా బీజేపీ యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా చిందులేసినారు.