calender_icon.png 19 November, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

19-11-2025 06:07:00 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): చింతకుంటలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణకు ముప్పై వేలు చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని ఆపదలో ఉన్నవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నమని అన్నారు.