25-08-2025 04:55:02 PM
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతి..
బెల్లంపల్లి: బెల్లంపల్లి బజార్ ఏరియాలో నాళాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి సైన్యం ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి మేయిన్ బాజార్ లో 2001 సెప్టెంబరు 15న కాలువ పైన ఉన్నాయని 118 షాపులను, ఇళ్లను కూలగొట్టిన అధికారులు ప్రస్తుతం బెల్లంపల్లి బజార్ ఏరియా లో నాళాలపై ఉన్న నిర్మాణాలపై స్పందించడం లేదని అన్నారు.
వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు నడిచే రహదారులోని 18 వార్డు కాంటాక్టర్ బస్తీ పాత గీత మహల్ హోటల్ వెనుక గల చెత్త, మట్టి కుప్పలతో నిండిపోయిన కాలువలోనీ పూడికను తొలగించాలని కోరారు. మేయిన్ రోడ్ పైన ఫుట్ పాత్ షాప్ ల వల్ల పార్కింగ్ సమస్యతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బెల్లంపల్లి బజార్ ఏరియా, కాంటక్టర్ బస్తీలోనీ గల్లీలు, రహదారుల కబ్జాలను తొలగించాలని కోరారు.