calender_icon.png 25 August, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

25-08-2025 04:57:57 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణంపై అవగహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్   ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టిజిపిసిబి నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టి  చెరువుల్లో మట్టి మేటలని  తొలగించటానికి చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలని మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.