25-08-2025 04:49:16 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్సి టోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరాటే లోని వివిధ విభాగాలలో వైష్ణవి, సుమయా బంగారు పతకాలు సాధించారు. శరణ్య, అన్విత, సిరివెన్నెల లు వెండి పతకాలు, కరిష్మా, లీక్ష దీశ్, సాధన, తేజశ్రీ, వినిత్యశ్రీ, దివ్య, ఆయేషా లు రాగి పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో కరిష్మా బంగారు పతకం, తమన్నా వెండి పతకం సాధించినట్లు మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ ఎండి. నీలు తెలిపారు. విద్యార్థులను తెలంగాణ జెన్ షిటోరియో కరాటే స్కూల్ చీఫ్ ఆవుల రాజనర్సు, మైనార్టీ స్కూల్ మాస్టర్ అంబాల శిరీష, జయ ప్రసాద్ లు అభినందించారు.