calender_icon.png 25 August, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారాసలో చేరిన మాజీ రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి

25-08-2025 05:13:37 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రైతుబంధు  సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై చర్చించారు. మాజీ మంత్రితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మోచి గణేష్, చందర్ తదితరులున్నారు.