calender_icon.png 17 October, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన సమితి పోరాటాలు ఉదృతం చేస్తాం

17-10-2025 03:05:48 PM

సాధన సమితి కన్వీనర్ నందిరామయ్య

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఖానాపూర్ పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ, పోరాటం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన జేఏసీ కమిటీ పోరాటాలు ఉదృతం చేస్తామని ఆ కమిటీ కన్వీనర్ నందిరామయ్య హెచ్చరించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో తాము దశల వారి ఉద్యమాలు చేయగా నాయకులు, జిల్లా కలెక్టర్ ఖానాపూర్ పట్టణంలోని 110 ఎకరాల్లో స్థలం ఎంత ఉందో సర్వే చేసి పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని తెలిపినప్పటికీ తాత్సారం చేస్తూ ఖానాపూర్లో నిర్మించాల్సిన పాఠశాలను నియోజకవర్గంలోని ఉట్నూరు మండలానికి తరలించుకుపోవడం శోచనీయమని అన్నారు.

ఇప్పటికైనా నాయకులు ఖానాపూర్, కడం, పెంబి, దస్తురాబాద్, మండలాల శ్రేయస్సు ద్రుష్టిలో ఉంచుకొని పాఠశాలను ఖానాపూర్ లోనే నిర్మించాలని లేదంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ గౌరవాధ్యక్షులు సాగి లక్ష్మణరావు, కో కన్వీనర్లు ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, బిసి రాజన్న, ప్రధాన కార్యదర్శి కాశ వేణి ప్రణయ్, కోశాధికారి ఎనగందుల నారాయణ, ముఖ్య సలహాదారులు కొత్తపల్లి సురేష్, బీసీ రమేష్, పుప్పాల ఉపేందర్, రాపల్లి రవీందర్ ,మేసా సతీష్, పిట్టల భూమన్న, బుట్టి రాజ్ కుమార్ ,బి వర్మ, తదితరులు ఉన్నారు.