calender_icon.png 11 September, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ మండలంలో నల్లబెల్లం గుటుకను పూర్తిగా నిషేధించాలి

11-09-2025 07:49:15 PM

సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలంలోని 49 గ్రామపంచాయతీలు ఆవాసం తండాలలో మరిపెడ మున్సిపాలిటీలో నల్ల బెల్లం వ్యాపారం గంజాయి నిషేధిత అంబర్ గుటక పలు అక్రమ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నందున దీనిపై మరిపెడ ఎస్సై పోలీస్ సిబ్బంది నిఘా ఉంచి పూర్తిగా అక్రమ వ్యాపారాలను నివారించాలని, అదేవిధంగా యువతను వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును చెడు వ్యసనాలకు బానిసై వారి యొక్క జీవితాలను మధ్యలోనే కోల్పోవడం జరుగుతుంది.

ఈ వ్యాపారాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ ప్రాంతం వారే కాబట్టి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల భవిష్యత్తు కోసం మరిపెడ మండల అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం పలు అక్రమ వ్యాపారాలను చేసే వ్యక్తుల పైతక్షణమే పిడి యాక్ట్ నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి వ్యాపారాలు మరిపెడలో పూర్తిగా నివారించాలని సిపిఐ మరిపెడ మండల సమితి తరపున పలు డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మరిపెడ ఎస్సై 2 కోటేశ్వరరావు  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నీలికుర్తి గ్రామ పార్టీ కార్యదర్శి అనపర్తి సత్యం, మరిపెడ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, యుగేందర్ ,బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.