11-09-2025 07:50:56 PM
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ సోసైటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సంతోష్ కుమార్, గౌరవాధ్యక్షులుగా ఇస్తారిగల్ల ఎల్లం, ప్రధాన కార్యదర్శిగా వెంకటస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా నరేందర్ రెడ్డి, కోశాధికారిగా కుమార్ స్వామి, సహాయ కార్యదర్శిగా భాస్కర్, కార్యవర్గ సభ్యులుగా మహేందర్, శ్రీనివాస్, చందు, కృష్ణ, మోహన్, నాగరాజు లు ఎన్నుకున్నట్లు భాద్యులు తెలిపారు. స్థానికుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ ఎంపికైన కార్యవర్గ ప్రతినిధులు వెల్లడించారు.