calender_icon.png 9 July, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల చట్టాలను కార్మికుల హక్కులను హరించవచ్చు..

09-07-2025 05:09:33 PM

సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య..

హుజురాబాద్ (విజయక్రాంతి): నల్ల చట్టాలతో కార్మికుల హక్కులను హరించవద్దని సిపిఐ, సిపిఎం మండల కార్యదర్శులు పిట్టల సమ్మయ్య, వెలమారెడ్డి రాజిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, కర్షకుల పొట్టను కోసే విధంగా నూతనంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలను 44 నుండి 4 కోడ్స్‌గా మార్చడం అన్యాయమని, జీఓ నెం 282ను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం ₹26,000గా నిర్దేశించాలనీ, భవన నిర్మాణ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ అన్నారు.

మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి సముచిత వేతనం చెల్లించాలనీ, కార్మిక, కర్షకుల రాజ్యాంగబద్ధ హక్కులు పరిరక్షించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగుల కుమార్, దేవయ్య, కొనగంటి శ్రీనివాస్, బూర్తుల శ్రీనివాస్, తిరుపతి, రామస్వామి, మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి రజిత, రాజేశ్వరి, బొజ్జ సాయిలు, ఎస్టీ బాబా, చక్రపాణి, మల్లేశం, సారయ్య, రాజమణి, లలిత తదితరులు పాల్గొన్నారు.