09-07-2025 08:24:54 PM
ఆటో డ్రైవర్ మృతి..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అందుగులపేట గ్రామ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్(SI Rajasekhar) తెలిపిన వివరాల ప్రకారం... తాండూర్ మండలం, రేచిని గ్రామానికి చెందిన గోమాస తిరుపతి(29), వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, తన స్నేహితుడైన గువ్వల కిషోర్‌తో కలిసి మంచిర్యాలకు వెల్లి పనులు ముగించుకొని తాండూరుకు వస్తుండగా మార్గ మధ్యలో అందుగులపేట సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆటోను గుర్తుతెలియని లారీ వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న గోమాస తిరుపతి, గువ్వల కిషోర్‌లకు గాయాలయ్యాయి. తిరుపతికి తీవ్ర గాయాలు కావడంతో, అతడిని వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ గా, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కెల్విన్ ఆసుపత్రికి తీసుకెల్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందారు. ఈ మేరకు మృతుని తమ్ముడు గోమాస రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.