09-07-2025 08:22:35 PM
త్రుటిలో తప్పిన ప్రమాదం..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipal) పోతురాజుపల్లి స్థానికులైన వడ్డెరల ట్రాక్టర్ అల్లాపూర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డుకు కింది భాగంలో పడిపోవడం జరిగింది. స్థానికులు తక్షణమే అక్కడికి చేరుకొని వారిని రక్షించారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, ట్రాక్టర్ డ్రైవర్ కి గాని, క్లీనర్ కి గాని ఎలాంటి గాయాలు కాలేదు ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు.