calender_icon.png 10 July, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

09-07-2025 08:15:09 PM

వలిగొండ (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్(SI Yugender Goud) అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిసి తెలియని వయస్సులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటారని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ కుమార్, స్టూడెంట్ కౌన్సిలర్ పరశురాములు, అధ్యాపకులు గణేష్, హనీఫ్, వెంకటాచారి, మురళి తదితరులు పాల్గొన్నారు.