09-07-2025 08:11:34 PM
గణేష్ టెంపుల్ అర్చకులు, అధికారులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాచల రాములోరి భూములలో ఆక్రమణదారులను తొలగించు ప్రక్రియలో, దేవాలయ కార్యనిర్వహణాధికారి యల్. రమాదేవిపై భూ అక్రమణదారుల భౌతిక దాడి హేయమైన చర్య అని సంఘటనపై శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, కొత్తగూడెం పట్టణం, మండలం కార్యనిర్వాహణాధికారి, అర్చకులు, సిబ్బంది అన్నారు. స్వామి వారి సంబంధించిన భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని భూములలో ఆక్రమణదారులు నిర్మాణములు చేపడుతున్న విషయమును, తెలుసుకొని అడ్డుకున్న దేవాలయ కార్యనిర్వహణాధికారిపై, సిబ్బందిపై, భౌతిక దాడినీ ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చక, సిబ్బంది, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.