15-10-2025 12:58:01 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎర్రవాగు సమీపంలోని తంగళ్లపల్లి, చిన్న తిమ్మాపూర్ గ్రామాల పంట పొలాల్లో పులి అడుగులను గ్రామస్తులు బుధవారం గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగజ్‌నగర్ అటవీ విభాగ అధికారులు పులి కదలికలను గమనిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.