calender_icon.png 28 December, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత బెల్లంపల్లి, మన్నెగూడలో పేదలకు దుప్పట్లు పంపిణీ..

28-12-2025 12:54:41 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పాత బెల్లంపల్లి మన్నెగూడ లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసారు. 100 మందికి పైగా ప్రతి సంవత్సరం చలికాలంలో నిరుపేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి దుప్పట్లు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం బెల్లంపల్లి మండలo పాత బెల్లంపల్లి మన్నెగూడలో 100 మందికి పైగా దుప్పట్లు పంపిణీ చేశా మని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో మారుమూల గ్రామo మువ్వాడ కొత్త దిమ్మడీగూడ ప్రాంతాల్లో 500 మందికి దుప్పట్లు పంపిణీ చేసారు.

అదేవిధంగా 200 మందికి పైగా చీరలు, చిన్నపిల్లలకు ఇతర వస్త్రాలు పంపిణీ చేసారు. ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు పేదవాళ్ల కోసం చేస్తూనే ఉంటామ వాకర్స్ అసిసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పాత బెల్లంపల్లి, మన్నెగూడలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలలో గ్రామ సర్పంచి పెట్టం రాజయ్య శ్రీ కారుకూరి రామచందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రత్నం రాజన్న, రంగ రామన్న, రాచర్ల సంతోష్ ,కజ్జం రమేష్, ఏనుగు నరేష్ ముత్తె వెంకట్ రాజం, మహేందర్ రెడ్డి, మహేందర్ చౌదరి, గరిగె రాజ్ కుమార్, గైని మల్లేష్, సుంకు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు