calender_icon.png 28 December, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో కొండెక్కిన కోడి మాంసం

28-12-2025 01:01:48 PM

నెల రోజుల్లోనే 70-80 రూపాయలు పెరుగుదల

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు రావడంతో ఒకేసారి అమాంతంగా కోడి మాంసానికి గిరాకీ ధర పెరుగుదల పెరిగింది. గతంలో కోడి మాంసం కిలో170-190 ఉండేది. ఎన్నికలు రావడంతో ఒక ప్రక్క ఎన్నికల్లో పోటీపడి నిలబడ్డ అభ్యర్థులు సైతం, పార్టీలు ప్రచారం చేసే వ్యక్తులకు, దావతులు పెరగడంతో గిరాకీ విపరీతంగా పెరిగింది.

దీనికి తోడు కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు సైతం ఇంటింటికి కోడి మాంసం పంపిన సంఘటన కోకోల్లలు. దీనితో ఒకేసారి భారీగా డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం కోడి కిలో మాంసం240-250 రూపాయలకు చేరింది. అయినప్పటికీ ప్రోటీన్ శాతం అధికంగా కోడి మాంసం ఉండడంతో, వైద్యుల సలహాల మేరకు ఒక ప్రక్కన రోగులు సైతం తినవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఒకేసారి గిరాకీ రేటు పెరగడంతో, చికెన్ సెంటర్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.