17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ముత్తారంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141 వ్యవస్థాపక దినోత్సవం

28-12-2025 12:51 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని 15 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.