07-01-2026 12:00:00 AM
భీమదేవరపల్లి, జనవరి 6(విజయక్రాం తి): ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా ఉండడమే మానవీయ ధర్మమని తోగు ట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఉద్బోధించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి 1100 కిలోల పెరుగు తో ధధి స్నానాభిషేకం మహా ఘట్టానికి మాధవానంద సరస్వతి విచ్చేశారు.ఈ సందర్భంగా ప్రతి మనిషి ధర్మం విడనాడకుండా భక్తిగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండి ఎవరిని కష్టపెట్టొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీతో ఉండడమే ధర్మం చెబుతుందన్నారు. స్థానాభిషేకానికి విచ్చేసిన సుమారు ఐదు వేల మంది భక్తులకు పంచముఖ ఆంజనేయస్వా మి ఆలయ చైర్మన్ కాసం రమేష్ గుప్తా మహా అన్నదానం చేశారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సాంస్కృత కళాబృందాలతో, భజన బృందాలతో మాధవానంద సరస్వతి చిందులేస్తూ ఆట పాటలతో రామున్ని కీర్తిస్తూ ఉల్లా సపరిచారు.
మొత్తం మీద వేకువజామున స్వామివారికి ధధి స్థానాభిషేకంతో ప్రారంభమైన కార్యక్రమాలు నాలుగు గంటల వరకు ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. వేడుకల్లో మాజీ ఎంపీపీ అశోక్ ముఖ ర్జీ, వంగ రవీందర్, కాసం జ్ఞాని ప్రశాంత్, వినిశెట్టి వెంకట్, ఉప్పుగంటి రమాదేవి, జైపాల్‌రె డ్డి, తిరుపతి, దివాకర్‌రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.