03-01-2026 12:00:00 AM
హుజూర్ నగర్, జనవరి 2: తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని లింగగిరి గ్రామ సర్పంచ్ మేడి సునీతరమణ,ఉప సర్పంచ్ చలమల సతీష్,గ్రామ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎండి హఫీజా నిజామోద్దీన్,గ్రామ అధ్యక్షులు చల్లమల్ల రాఘవయ్య, కోరారు. శుక్రవారం మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో షేక్ ముజ్జు జ్ఞాపకార్ధంగా అతని స్నేహితులు, లింగగిరి యూత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు...
తలసేమియా బాధితులకు నేడు రక్తం దొరకడం కష్టంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.రక్తదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా,వార్డు మెంబర్లు, తదితరులు, పాల్గొన్నారు.