07-07-2025 01:33:46 AM
పంపిణీ కోసం 80 కోట్లు కేటాయింపు సొసైటీల ద్వారానే పంపిణీ చేయాలంటున్న మత్స్యకారులు
-సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తులు
-రెండేళ్ల బకాయిలు విడుదల చేయాలంటున్న వ్యాపారులు
-ఏటా జూలై నెలఖారులో జలాశయాల్లో చేప పిల్లల విడుదల
-ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : చెరువులు, జలాశయాల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై సర్కార్ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. ప్రభుత్వం మాత్రం చేప పిల్లల పంపిణీ కోసం రూ. 80 కోట్లు కేటాయించింది. వర్షాలు పడి, చెరువులు, ఇతర జలాశాయాల్లోకి కొత్త నీరు రాగానే ప్రతి ఏటా రాష్ట్రంలో జూలై నెలాఖర్ నాటికి మ త్స్యకార సహకార సంఘాల పరిధిలోని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను వ దులుతారు.
అంతకు ముందే చెరువుల్లోకి వదిలే చేప పిల్లలకు సంబంధించిన కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా సంబంధిత శాఖ ఎం పిక చేస్తోంది. అయితే ఈసారి కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా.. మత్స్యకార సహకార సొ సైటీల ద్వారానే చెరువుల్లోకి చేపల పంపి ణీ చేయాలని, అందుకు సంబంధించిన నిధుల ను తమ సొసైటీల ఖాతాల్లోనే నేరుగా జమ చేయాలని మత్స్యకార సొసైటీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మ త్స్యకార సొసైటీలు తీర్మానాలు చేసి ఆ కాపీలను సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు చేస్తున్నారు.
గత ప్రభుత్వం హయాంలో నష్టపోయాం..
గత ప్రభుత్వంలో చేప పిల్లల కొనుగోలు లో జరిగిన అవకతవకల కారణంగా మత్స్యకార సొసైటీలు తీవ్రంగా నష్టపోయినాయని ఆయా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది చేప పిల్లలు కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లోనే చూపిం చారని, చెరువుల్లోకి చేప పిల్లలను వదిలేటప్పుడు తమకు చూపించలేదని చెబుతు న్నారు.
వ్యాపారులు చెప్పిన దానికి, ఆచరణలోకి వచ్చే వరకు చాలా వ్యత్యాసం ఉందని, తక్కువ చేప పిల్లలను చెరువుల్లోకి వదిలి, ఎక్కువగా చూపారనే విమర్శలు ఉన్నాయి. చెరువుల్లో తక్కువ చేప పిల్లల వదలడం వల్ల చేపల సంపద అనుకున్నంత స్థాయిలో పెరగకపోవడం వల్ల మత్స్యకారుకు తీవ్రంగా నష్టం జరిగిందనే విమర్శలు వినిపించాయి.
దీంతో చెరువులపై ఆధారపడి చేపల వేట వృత్తిని ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న బెస్త, గంపుత్రులకు ఉచిత చేప పిల్లల పంపిణీ వల్ల పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదనే చెబుతున్నారు.చేపల వ్యాపారులకు కొనుగోలు కోసం ఇచ్చే డబ్బులను మత్స్య సహకార సంఘాల బ్యాకు ఖాతాల్లో జమచేస్తే నేరుగా సొసైటీలు చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో పెంచుకోవడం ద్వారా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయానికి అస్కారం ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పాత బకాయిలు ఇస్తేనే చేప పిల్లల పంపిణీ..
ఇదిలా ఉంటే, గతంలో చెరువుల్లో చేప పిల్లలు వదిలిన వ్యాపారుల పరిస్థితి మరో లా ఉంది. గత రెండు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తే చేప పిల్లలను సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పాత బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పాత బకాయిల విషయంలో ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించడంతో.. అతని బకాయిలను ప్రభు త్వం చెల్లించింది.
దాంతో మిగతా వ్యాపారు లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అ యితే ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని మ త్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లల ను వదలాల్సి ఉంది. ఇదే విషయాన్ని సం బంధిత శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి చేపల వ్యాపారులు తీసుకెళ్లారు. బకాయిలు విడుదల చేసేందుకు తాను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని వ్యాపారులు చెబు తున్నారు.
ఎకరాకు 2 వేల చేప పిల్లలు..
రాష్ట్రంలో మొత్తం 6,650 మత్స్యకార సొసైటీలు ఉండగా, చిన్న, పెద్ద చెరువులు కలిపి మొత్తం 72 వేల వరకు ఉన్నాయి.100 రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. మత్స్య పరిశ్రమ మీద దాదాపు 6 లక్షల వరకు ఆదారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, జలాశాయల్లో ఎకరాకు 2 వేల చేప పిల్లల చొప్పున మొత్తం 600 కోట్ల వరకు చేప పిల్లలు వదలాల్సి ఉంటుంది.
కానీ ప్రభుత్వం మాత్ర 100 కోట్ల చేప పిల్లల పంపిణీకి అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల చేప పిల్లల పంపిణీలోనూ టెండర్‌దారులు 50 శాతం మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేసి మిగతా చేప పిల్లల డబ్బులను నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే చేప పిల్లల పంపిణీ పథకం డబ్బులను సొసైటీల బ్యాంకు ఖాతాలకే నేరుగా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మత్స్యకార సొసైటీ నేతలు చెబుతున్నారు.