07-07-2025 01:30:31 AM
నాగర్ కర్నూల్ జూలై 6 (విజయక్రాంతి) తాగు సాగునీటితోపాటు ఆయా కులవృత్తులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యం తో నాడు కాకతీయులు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువుల్లో నేడు దళారుల రూపంలో చేపల దొంగలు రాబందులుగా మారారు. గత ము ఖ్యమంత్రి కేసీఆర్ కూడా కులవృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గొలుసుకట్టు చెరువుల్లో చేప పిల్లలను సబ్సిడీ ద్వారా పం పిణీ చేస్తూ మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
దాంతోపాటు స్థానిక మత్స్యకారులే చేపలు పట్టుకోవాలన్న ఉద్దేశంతో వారికి వాహనాలు, వలలు, ఇతర సా మాగ్రిని కూడా సబ్సిడీ ద్వారా పంపిణీ చేశారు. కానీ గులాబీ పార్టీలోని ముఖ్య అనుచరులు అక్రమ మార్గంలో మత్స్యకార సొసైటీలో చొరబడి ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వృద్ధి చెందిన అనంత రం ఆయా ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు దళారులకు అమ్ముకొని ఈ ప్రాం త వాసులకు మొండి చేయి చూపారు.
ఒక్కో మత్స్యకారుడికి రోజుకు 25 రూపాయల చొప్పున మూడేళ్ల పాటు అర్రాస్ పాడి వారి కి ఉపాధి లేకుండా చేప పిల్లలను ఇతర ప్రాంతాలకు అమ్ముకొని కోట్లు కూడబెట్టుకున్నారు. దాని ఫలితంగా ఈ ప్రాంత వాసులకు చేపలు దొరకడం కష్టంగా మారింది. అ దే వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వా రంతా పట్టణాల్లో భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసుకునే పరిస్థితి దాపురించింది.
ఇదే విషయాన్ని ముందే పసిగట్టి విజయక్రాంతి వరు స కథనాలను ప్రచురించడంతో జిల్లా మ త్స్యశాఖ అధికారిని రజిని, జిల్లా కలెక్టర్ బా దావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి స్పందించారు. అక్రమంగా దళారులు చెరువులను అర్రాస్ పాడిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ని లువరించారు. అయినా రాజకీయ పలుకుబడితో దొడ్డి దారిన చేపలు పట్టేందుకు యత్నించిన దళారులకు జిల్లా కోర్టు సైతం మొట్టికాయలు వేసింది.
అయినా వినకుం డా జిల్లా అధికారి నీపై దుష్ప్రచారం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించగా హైకోర్టు సైతం పూర్తిస్థాయిలో విచారణ అనంతరం దళారులను మందలిస్తూ స్థానికలు మాత్ర మే చేపలు పట్టుకునేలా తీర్పు విలువరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా చెరు వుల్లో అక్రమంగా చేపలు పట్టుకుంటున్న దళారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా మారింది.
అక్రమ మార్గాన సొసైటీలోకి చొరబడి...!
జిల్లా వ్యాప్తంగా 963 చెరువులు కుం టలు ఉన్నాయి. వీటి పరిధిలో 235 మత్స్యకార సహకార సంఘాల్లో 17,590 మంది స భ్యులు ఉన్నారు. కాగా గత బిఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో 172 మందిని అక్రమ మా ర్గంలో సభ్యులుగా చేర్చినట్లు ఆరోపణలు ఉ న్నాయి. ఒక్కో సభ్యుడు నుండి సుమారు 30 నుండి 50 వేల వరకు వసూలు చేసిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎలాంటి స్కి ల్ టెస్ట్ నిర్వహించకుండానే అర్హులతో పాటు అనర్హులతోనూ ముడుపులందుకొని సభ్య త్వం ఇచ్చినట్లు అధికారుల విచారణలో బ యటపడింది. ఈసారి ప్రభుత్వం చెరువులు కుంటల్లో 82 లక్షల కు పైగా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. అయినా ఈ ప్రాంత మత్స్యకారులు కాకుండా దళారుల తో చేపలు పట్టేందుకు అడ్రస్ పాట పాడి ఇతర ప్రాంతాలకు చేపలు అమ్ముకోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిజమైన మత్స్యకారులకు అవకాశం ఇవ్వండి
ఇదే వృత్తిపై జీవిస్తున్న మాకు చేపలు ప ట్టుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఇదే విషయాన్ని సొసైటీలో ప్రశ్నించినందుకు అనర్హ త వేటు వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లా కోర్టు కూడా స్థానిక మత్స్యకా రులే చేపలు పట్టుకోవాలని తీర్పు ఇచ్చింది. మళ్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు అక్కడ కూడా స్థానిక మత్స్యకారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది.
డోకూర్ మన్యం, మత్స్యకారుడు ఉయ్యాలవాడ
హైకోర్టు తీర్పు దళార్లకు చెంపపెట్టు
స్థానికంగా ఇదే వృత్తిపై జీవిస్తున్న మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకునే అవకాశం ఉంది. కానీ కొంతమంది దళారుల అవతారంలో చేపలను ఇతర ప్రాంతాలకు అమ్ముకునేందుకు అర్రాస్ పాడినట్లు మా దృష్టికి వచ్చింది .
దీనిపై పూర్తి నివేదిక ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని నిలుపుదల చేశాము. అయినా వినకపోవడం తో కొందరు మత్స్యకారులు కోర్టు మె ట్లు ఎక్కారు దీంతో దళారులకు మొట్టికాయలు వేసింది. మిగతా మత్స్యకార సొసైటీ నేతలు కూడా స్థానిక మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు అవకా శం కల్పించాల్సి ఉంది. లేదంటే కఠిన చర్యలు తప్పవు.
రజిని, మత్స్య శాఖ జిల్లా అధికారిణి,నాగర్‌కర్నూల్