calender_icon.png 14 October, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొలెరో వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం

12-11-2024 12:59:47 PM

వనపర్తి (విజయక్రాంతి): పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళుతున్న కూలీల బోలెరో వాహనం బోల్తా పడిన ఘటన 44 వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారంగా కొత్తకోట మండలం భూత్కూర్ గ్రామానికి చెందిన 30 మంది కూలీలు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకంపల్లిలో పత్తి తీసేందుకు బోలెరో వాహనంలో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద 44 వ జాతీయ రహదారిపై కుడి టైర్ పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. వీరిలో ఆంజనేయులు, సారాంబి, పర్వీన్, నర్సమ్మ, అబ్దులమ్మ, త్రీవంగా గాయపడగా మెరుగైన చికిత్స నిమిత్తం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికీ తరలించగా అక్కడి నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తరలించారు. వాహనం బోల్తా పడిన సమయంలో వెనుక నుండి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.