08-07-2025 06:50:55 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapally Mandal)లోని పలు గ్రామాల్లో గిరిజనులు ప్రతి ఏటా పెద్దపుశాల కార్తెలో నిర్వహించుకునే సీత్లాభవాని 'దాటుడు' పండుగను మండలంలోని లచ్చ తండా, సింగ్యాతండా, రేగులతండా, కాలనీ తండా తదితర గ్రామాలతో పాటు మండల వ్యాప్తంగా గిరిజనులు భక్తి శ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజలు, పశు పక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన మహిళలు, యువతులు సీత్ల భవానీకి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బానోత్ మోతిలాల్ నాయక్, గూగులోతు మాను నాయక్, మంగితీయ నాయక్, ఇస్లావత్ నంద, భూక్యా లాలూ నాయక్, గుగులోతు శంకర్ నాయక్, బాలాజీ నాయక్, బన్సీలాల్ నాయక్, హిరామల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.