08-07-2025 06:36:51 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ హై స్కూల్(Sri Saraswathi Shishu Mandir High School)లో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు మహోత్సవం వైభవంగా ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. మాతాజీలు, మహిళా సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని, సంప్రదాయానికి ప్రాధాన్యతనిస్తూ, భారతీయ సంస్కృతి అందాల్ని ప్రతిబింబించే విధంగా గోరింటాకు అలంకారాలు ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేస్తూ, వాటిని గౌరవించేలా ప్రేరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గోరింటాకు పండుగ కార్యక్రమం-సాంప్రదాయం, సౌందర్యం, సమూహం అన్నింటినీ ఏకత్రపరిచే ఒక సానుకూలమైన సంబరంగా నిలిచింది అని ప్రిన్సిపాల్ రాజమౌళి తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, తణుకు మహేష్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందం, గట్టు రాం ప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి తదితరులు పాల్గొన్నారు.