calender_icon.png 9 July, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

08-07-2025 06:56:50 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో మంగళవారం రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పలువురు మాట్లాడుతూ... వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, నాయకులు బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, ఉలిపే మల్లేశం, కాసుల వెంకటేశం, మామిడి నరేందర్ రెడ్డి, పులిపలుపుల రాములు, చిలుగురి సత్తిరెడ్డి, బత్తిని వరుణ్, పాలకూర వెంకటేశం, మైసోల్లా ప్రవీణ్, బుగ్గ ఉదయ్, పుసునూరి లింగం, ఎదురుగట్ల బాలు తదితరులు పాల్గొన్నారు.