08-07-2025 06:54:14 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కన్నెపల్లి మండలంలో ఓ సామాజిక కార్యకర్త విద్యార్థులకు రూ.3 వేల విలువైన ఉచిత రాత పుస్తకాలను విద్యార్థులకు అందజేసి తన సేవా భావాన్ని చాటుకున్నారు. జజ్జరవెల్లి గ్రామ పంచాయతీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సామాజిక కార్యకర్త ఇరుకుల్ల శ్రీనివాస్ (ZEN MONEY ADVISOR) రూ.3 వేల విలువ గల చూచి(Copy writing)రాత పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంకతి తిరుపతి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఈవిధంగా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సహకారం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతోగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉచితంగా పుస్తకాలు అందజేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు రాథోడ్ సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు లింగంపల్లి రజిత, భీమేష్, లత, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.