08-07-2025 07:19:41 PM
భైంసా (విజయక్రాంతి): బాసర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను నిర్వహించారు. బాసర పట్టణంలో గల దుర్గమ్మ మహంకాళి అమ్మ(Goddess Durga Mahakali) విగ్రహాలకు బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నట్లు ఆటో యూనియన్ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.