18 April, 2026 | 12:19 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు!

16-06-2025 01:47 AM

హైదరాబాద్, జూన్ 15: జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యలో నుంచే వెనక్కి మళ్లించారు. లుఫ్తాన్సా ఎల్ 752 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయం నుంచి బయలుదేరగా బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని మళ్లీ ఫ్రాంక్‌ఫర్డ్‌కే తరలించారు.

శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఈ బాంబు బెదిరింపు వార్తను ధృవీకరించారు. ఈ విమానంలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో పక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే ఓ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూడు గంటలకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాశారు.