04-08-2025 12:14:52 AM
వికారాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి) మండల పరిధిలోని జాఫర్ పల్లి గ్రామంలో డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సం దర్భంగా లాలూ కృష్ణ మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో రేషన్ కా ర్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజా పాలనలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కా ర్డులు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిత యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేష్ కుమార్, రేషన్ కార్డు లబ్ధిదారులు, తదితరులుపాల్గొన్నారు.