calender_icon.png 27 July, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీపీ ఫైనల్స్‌కు బోపన్న జోడీ

30-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న సీజన్ చివరి ఏటీపీ టూర్ ఫైనల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. నవంబర్ 10 నుంచి 17 మధ్య జరగనున్న ఏటీపీ ఫైనల్లో బోప న్న తన పార్టనర్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బరిలోకి దిగను న్నాడు. ఫైనల్లో టాప్-8 జోడీలు మాత్రమే పాల్గొననున్నాయి. పారిస్ మాస్టర్స్‌లో నాథనియెల్ లామ్మన్స్-జాక్సన్ జోడీ ఓటమి చవిచూడడంతో బోపన్నఎబ్డెన్ జంటకు ఏటీపీ టూర్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది.