calender_icon.png 27 July, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరికృష్ణ, వంశీలకు రేవంత్ అభినందన

30-10-2024 12:00:00 AM

హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం హరిక్రిష్ణ సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయ న నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశా డు. ఇటీవలే బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణం గెలవగా.. పురుషుల జట్టు లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్నాడు.

అంతకముందు  సీఎం రేవంత్‌ను తెలంగాణ పవర్ లిఫ్టర్ మొడెం వంశీ ప్రత్యేకంగా కలుసుకు న్నాడు. ఇటీవలే మాల్టా వేదికగా జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వంశీ స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి గిరిజన క్రీడాకారుడిగా వంశీ నిలిచాడు.