calender_icon.png 7 August, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్డర్2 ముగించారు

07-08-2025 01:27:53 AM

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, మేధా రానా జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘బార్డర్2’. ఈ సినిమాను అనురాగ్ సింగ్ దర్శకత్వంలో జేపీ ఫిల్మ్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన ‘బార్డర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలీవుడ్ హీరో దిల్జీద్ దోసాంజ్, నితీశ్ నిర్మల్, అహన్‌శెట్టి, వినాలీ భట్నాగర్, సన్నీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ ముగిసిన సందర్భాన్ని చిత్రబృందం బుధవారం కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కథానాయిక మేధా రానా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఈ మరుపురాని ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ జర్నీని, ‘బార్డర్2’ టీమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇది చాలా ప్రత్యే కం” అని రాసుకొచ్చింది మేధా. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.