07-08-2025 01:26:41 AM
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లముడి నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలకు కానున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ మేరకు థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘సీతమ్మోరు లంకాదహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురుగానీ..’ అన్న డైలాగ్‌ను బట్టి చూస్తే..
అనుష్క ఇందులో తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోసినట్టు తెలుస్తోంది. విక్రమ్ ప్రభు పాత్ర సైతం బలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. చైతన్యరావు, రవీంద్రన్ విజయ్ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. జగపతిబాబు ప్రజెన్స్ మరింత క్యురియాసిటీ పెంచింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; డీవోపీ: మనోజ్‌రెడ్డి కాటసాని; మాటలు: సాయిమాధవ్ బుర్రా; కథ: చంటకింది శ్రీనివాసరావు; యాక్షన్: రామ్‌కృష్ణ; ఎడిటర్: చాణక్యరెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి; ఆర్ట్: తోట తరణి.