calender_icon.png 7 August, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మకంతో జర్నీ ప్రారంభించాం

07-08-2025 01:29:15 AM

‘మ్యాడ్’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక 

శ్రీగౌరీప్రియ. అంతకుముందు ‘మెయిల్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. బ్యాక్‌టుబ్యాక్ ప్రాజెక్టులు ప్రకటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ‘వింటారా సరదాగా’, ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాలున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రాజెక్టుకు తాను సైన్ చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను సైతం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.

‘ప్రతి ఫ్రేమ్ విశ్వాసంతో ప్రారంభమవుతుంది. నమ్మకంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం’ అని పేర్కొంది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడు. శ్రీగౌరీప్రియ.. జీవీ ప్రకాశ్‌కు జంటగా నటిస్తుండగా, ఇందులో అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరియా ఎలాంచెజియన్ దర్శకత్వంలో ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జయవర్ధన్ నిర్మిస్తున్నారు.