10-11-2025 01:26:02 AM
తంగళ్ళపల్లి,నవంబరు నవంబర్ 9 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా పది కోట్లు కేటాయించిన నేపథ్యంలో లక్ష్మీపూర్ వాటర్ ప్లాంట్కు రెండు లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో బోర్ వేయడం మరియు మోటార్ బిగించడం పూర్తి చేసి ప్రారంభించారు.
ఈ నిధులను మంజూరు చేసిన ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జ్ కె కె మహేందర్ రెడ్డి, తంగాల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజలు.ఈ కార్యక్రమంలో ఆరేపల్లి బాలు ఏఎంసి డైరెక్టర్,నాబార్డ్ కమిటీ మెంబ ర్ పబ్బా ముత్తయ్య, నల్లగొండ లక్ష్మి రాజం, గడ్డం అజయ్, తక్కల్ల ప్రశాంత్, నందగిరి ఆంజనేయులు, మైలారపు రఘు, బుర్ర వినయ్, అట్టెల చందు, తక్కళ్ళ ఆంజనేయులు, నాగరాజు, కిట్టు, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.